‏ 1 Chronicles 1

ఆదాము నుండి అబ్రాహాము వరకు చర్రిత వివరాలు

నోవహు కుమారుల వరకు

1ఆదాము, షేతు, ఎనోషు,
2కేయినాను, మహలలేలు, యెరెదు,
3హనోకు, మెతూషెల, లెమెకు,
నోవహు.

4నోవహు కుమారులు:
కొ.ప్ర.లలో ఈ మాట లేదు
షేము, హాము, యాపెతు.

యాపెతీయులు

5యాపెతు కుమారులు
అంటే సంతతివారు లేదా వారసులు లేదా జనాంగాలు; 6-9, 17, 23.
:
గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
6గోమెరు కుమారులు:
అష్కెనజు, రీఫతు
కొ. ప్ర. లలో డీఫతు; ఆది 10:3 లో కూడా చూడండి
, తోగర్మా.
7యవాను కుమారులు:
ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.

హామీయులు

8హాము కుమారులు:
కూషు, ఈజిప్టు, పూతు, కనాను.
9కూషు కుమారులు:
సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా.
రాయమా కుమారులు:
షేబ, దేదాను.
10కూషు నిమ్రోదుకు తండ్రి,
ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.
11ఈజిప్టు కుమారులు:
లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,
12పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.
13కనాను కుమారులు:
మొదటి కుమారుడగు సీదోను,
లేదా సీదోనీయులు
హిత్తీయులు,
14యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 15హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, 16అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు.

షేమీయులు

17షేము కుమారులు:
ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
అరాము కుమారులు:
కొ.ప్ర.లలో ఈ మాట లేదు

ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
18అర్పక్షదు షేలహుకు తండ్రి,
షేలహు ఏబెరుకు తండ్రి.
19ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు:
ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు,
పెలెగు అంటే విభజన
ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
20యొక్తాను కుమారులు:
అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21హదోరము, ఊజాలు, దిక్లా, 22ఓబాలు,
కొ.ప్ర.లలో ఏబాలు
అబీమాయేలు, షేబ,
23ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.

24షేము, అర్పక్షదు, షేలహు,
25ఏబెరు, పెలెగు, రయూ,
26సెరూగు, నాహోరు, తెరహు,
27అబ్రాము (అనగా అబ్రాహాము).

అబ్రాహాము కుటుంబం

28అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు.

హాగరు ద్వారా వచ్చిన సంతానం

29వీరు వారి సంతానం:
ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,
30మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, 31యెతూరు, నాపీషు, కెదెమా.
వీరు ఇష్మాయేలు కుమారులు.

కెతూరా ద్వారా వచ్చిన సంతానం

32అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు:
జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు.
యొక్షాను కుమారులు:
షేబ, దేదాను.
33మిద్యాను కుమారులు:
ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.
వీరంతా కెతూరా సంతానము.

శారా ద్వారా వచ్చిన సంతానం

34అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు:
ఏశావు, ఇశ్రాయేలు.

ఏశావు సంతానం

35ఏశావు కుమారులు:
ఎలీఫజు, రెయూయేలు, యూషు, యాలాము, కోరహు.
36ఎలీఫజు కుమారులు:
తేమాను, ఓమారు, సెఫో,
చాలా హెబ్రీ ప్రతులలో సెఫీ
గాతాము, కనజు;
తిమ్నా ద్వారా అమాలేకు.
కొ.ప్ర.లలో గాతాము, కెనజు, తిమ్నా, అమాలేకు

37రెయూయేలు కుమారులు:
నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.

ఎదోములో ఉన్న శేయీరు వంశావళి

38శేయీరు కుమారులు:
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39లోతాను కుమారులు:
హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.
40శోబాలు కుమారులు:
అల్వాను,
చాలా హెబ్రీ ప్రతులలో, కొ. ప్ర. లలో అలియాను
మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము.
సిబ్యోను కుమారులు:
అయ్యా, అనా.
41అనా కుమారుడు:
దిషోను.
దిషోను కుమారులు:
హెమ్దాను,
చాలా హెబ్రీ ప్రతులలో, కొ. ప్ర. లలో హమ్రాను
ఎష్బాను, ఇత్రాను, కెరాను.
42ఏసెరు కుమారులు:
బిల్హాను, జవాను, ఆకాను.
చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో యహకాను

దిషాను
ఆది 36:26 హెబ్రీ దిషోను, ఇంకో విధంగా దిషాను
కుమారులు:
ఊజు, అరాను.

ఎదోము పాలకులు

43ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు.
44బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.
45యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.
46హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.
47హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.
48శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.
49షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.
50బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు,
చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో పాయి
ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
51హదదు కూడా చనిపోయాడు.

ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు,
52ఒహోలీబామా, ఏలహు, పీనోను, 53కనజు, తేమాను, మిబ్సారు, 54మగ్దీయేలు, ఈరాము.
వీరు ఎదోము నాయకులు.
Copyright information for TelTSA