‏ 1 Chronicles 3

దావీదు కుమారులు

1దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు వీరు:

యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను మొదటి కుమారుడు;
కర్మెలుకు చెందిన అబీగయీలుకు పుట్టిన దానియేలు రెండవ కుమారుడు;
2గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకా కుమారుడైన అబ్షాలోము మూడవ కుమారుడు;
హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;
3అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;
దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.

4ఈ ఆరుగురు దావీదుకు హెబ్రోనులో పుట్టినవారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.

దావీదు యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
5యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు:

అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు
కొ.ప్రా.ప్ర. లలో బత్-షుయ 2 సమూ 11:3
పుట్టిన షమ్మువ,
హెబ్రీలో షిమ్యా షమ్మువ మరొక రూపం
షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.
6ఇభారు, ఎలీషువ,
కొ.ప్ర.లలో ఎలీషామా
ఎలీఫెలెతు,
7నోగహు, నెఫెగు, యాఫీయ, 8ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. మొత్తం తొమ్మిదిమంది ఇతర కుమారులు.

9ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.

యూదా రాజులు

10సొలొమోను కుమారుడు రెహబాము,
అతని కుమారుడు అబీయా,
అతని కుమారుడు ఆసా,
అతని కుమారుడు యెహోషాపాతు,
11అతని కుమారుడు యెహోరాము,
హెబ్రీలో యోరాము యెహోరాము యొక్క మరో పేరు

అతని కుమారుడు అహజ్యా,
అతని కుమారుడు యోవాషు,
12అతని కుమారుడు అమజ్యా,
అతని కుమారుడు అజర్యా,
అతని కుమారుడు యోతాము,
13అతని కుమారుడు ఆహాజు,
అతని కుమారుడు హిజ్కియా,
అతని కుమారుడు మనష్షే,
14అతని కుమారుడు ఆమోను,
అతని కుమారుడు యోషీయా.
15యోషీయా కుమారులు:
మొదటి కుమారుడు యోహానాను,
రెండవవాడు యెహోయాకీము,
మూడవవాడు సిద్కియా,
నాలుగవవాడు షల్లూము.
16యెహోయాకీము వారసులు:
యెహోయాకీను,
యెకొన్యా యెహోయాకీను యొక్క మరొక పేరు

అతని సోదరుడు
హెబ్రీలో కుమారుడు, 2 దిన 36:10 చూడండి
సిద్కియా.

చెర తర్వాత రాజ వంశస్థులు

17ఖైదీగా ఉన్న యెహోయాకీను సంతానం:
అతని కుమారుడు షయల్తీయేలు,
18మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
19పెదాయా కుమారులు:
జెరుబ్బాబెలు, షిమీ.
జెరుబ్బాబెలు కుమారులు:
మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి.
20మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు.
21హనన్యా వారసులు:
పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులు, అర్నాను కుమారులు, ఓబద్యా కుమారులు, షెకన్యా కుమారులు.
22షెకన్యా వారసులు:
షెమయా, అతని కుమారులు: హట్టూషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు మొత్తం ఆరుగురు.
23నెయర్యా కుమారులు:
ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము మొత్తం ముగ్గురు.
24ఎల్యోయేనై కుమారులు:
హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని మొత్తం ఏడుగురు.
Copyright information for TelTSA