1 Chronicles 4
యూదా యొక్క ఇతర వంశాలు
1యూదా వారసులు:పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.
2శోబాలు కుమారుడైన రెవాయాకు యహతు పుట్టాడు, యహతుకు అహూమై, లహదు పుట్టారు. ఇవి సొరాతీయుల వంశాలు.
3ఏతాము కుమారులు ▼
▼హెబ్రీలో తండ్రి
వీరు:యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సోదరి పేరు హజ్జెలెల్పోని. 4గెదోరు తండ్రి పెనూయేలు, హూషా తండ్రి ఏజెరు.
వీరు హూరు సంతానం, బేత్లెహేముకు తండ్రియైన ▼
▼తండ్రి బహుశ పాలకుడు లేదా సైన్య అధికారి
ఎఫ్రాతాకు మొదటి కుమారుడు హూరు.5తెకోవా తండ్రియైన అష్షూరుకు హెలా, నయరా అనే ఇద్దరు భార్యలున్నారు.
6నయరా వలన అతనికి అహుజాము, హెఫెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీరు నయరా సంతానము.
7హెలా కుమారులు:
జెరెతు, సోహరు, ఎత్నాను, 8అనూబు, హజోబేబా, హారూము కుమారుడైన అహర్హేలు వంశాలకు తండ్రియైన కోజు.
9యబ్బేజు ▼
▼యబ్బేజు హెబ్రీ పదంలా ఉంది వేదన అని అర్థం
తన సోదరులకంటే ఘనత పొందాడు. అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. 10యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు. 11కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి. 12ఎష్తోను బేత్-రాఫాకు పాసెయకు ఈర్-నహాషు ▼▼లేదా నాహాషు పట్టణం
తండ్రియైన తెహిన్నాకు తండ్రి. వీరు రేకా వారసులు.13కెనజు కుమారులు:
ఒత్నీయేలు, శెరాయా.
ఒత్నీయేలు కుమారులు:
హతతు, మెయానొతై. ▼
▼కొ.ప్ర.లలో మెయానొతై లేదు
14మెయానొతై ఒఫ్రాకు తండ్రి.శెరాయా యోవాబుకు తండ్రి,
యోవాబు గె-హరషీముకు ▼
▼గె-హరషీము అంటే నిపుణులైన పనివారు గల లోయ
తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది.15యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు:
ఈరూ, ఏలా, నయము,
ఏలా కుమారుడు:
కనజు.
16యెహల్లెలేలు కుమారులు:
జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు.
17ఎజ్రా కుమారులు:
యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను.
మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు. 18మెరెదు పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెయైన బిత్యా ద్వారా పుట్టిన కుమారులు వీరే.
యూదు గోత్రీకురాలైన అతని భార్యకు గెదోరు తండ్రియైన యెరెదు, శోకోకు తండ్రియైన హెబెరు, జానోహ తండ్రియైన యెకూతీయేలు పుట్టారు.
19నహము సోదరియైన హూదీయా భార్యకు పుట్టిన కుమారులు:
గర్మీయుడైన కెయీలా తండ్రి, మయకాతీయుడైన ఎష్టెమో.
20షీమోను కుమారులు:
అమ్నోను, రిన్నా, బెన్-హనాను, తీలోను.
ఇషీ సంతానం:
జోహేతు, బెన్-జోహేతు.
21యూదా కుమారుడైన షేలా కుమారులు:
లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా, సన్నని నారబట్టలు నేసే బేత్-అష్బేయ వంశీకులు,
22యోకీము, కోజేబా వారు, యోవాషు, శారాపు, మోయాబులో, యాషూబిలెహెములో పరిపాలన చేశారు. (ఇవి పూర్వకాలంలో వ్రాసి పెట్టిన సంగతులు.) 23వారు నెతాయీములో, గెదేరాలో నివసించిన కుమ్మరులు. వారు అక్కడే నివసించి రాజు కోసం పని చేశారు.
షిమ్యోను
24షిమ్యోను వారసులు:నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు;
25షావూలు కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు మిబ్శాము, మిబ్శాము కుమారుడు మిష్మా.
26మిష్మా సంతానం:
మిష్మా కుమారుడు హమ్మూయేలు, అతని కుమారుడు జక్కూరు, అతని కుమారుడు షిమీ.
27షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు కాని అతని సోదరులకు ఎక్కువ మంది పిల్లలు లేరు; కాబట్టి యూదా వారు వృద్ధి చెందినట్లుగా వారి వంశం మొత్తం వృద్ధి చెందలేదు. 28వారు బెయేర్షేబ, మొలాదా, హజర్-షువలు, 29బిల్హా, ఎజెము, తోలాదు, 30బెతూయేలు, హోర్మా, సిక్లగు, 31బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే. 32ఏతాము, ఆయిను, రిమ్మోను, తోకెను, ఆషాను అనే అయిదు గ్రామాలు వారి చుట్టూ ఉండేవి, 33బయలు ▼
▼కొ.ప్ర.లలో బాలతు
వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు. వారు తమ వంశాలను నమోదు చేసి ఉంచారు: 34మెషోబాబు, యమ్లేకు;అమజ్యా కుమారుడైన యోషా; 35యోవేలు;
అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడు యెహు;
36ఎల్యోయేనై; యహకోబా; యెషోహాయా;
అశాయా; అదీయేలు; యెశీమీయేలు; బెనాయా;
37షెమయా కుమారుడైన షిమ్రీకి పుట్టిన యెదాయా కుమారుడైన అల్లోనుకు పుట్టిన షిపి కుమారుడు జీజా.
38పైన పేర్లు పేర్కొన్న వారు తమ తమ వంశాలకు నాయకులు. వీరి కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి, 39వారు తమ మందల కోసం మేత వెదకడానికి లోయలో తూర్పుగా ఉన్న గెదోరు పొలిమేర వరకు వెళ్లారు. 40వారికి అక్కడ మంచి పుష్టికరమైన మేత దొరికింది. ఆ ప్రాంతం విశాలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. గతంలో హాము వంశీయులు కొంతమంది అక్కడ నివసించారు. 41జాబితాలో పేర్లు వ్రాయబడిన వీరు యూదా రాజైన హిజ్కియా కాలంలో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న హాము వంశీయుల మెయునీయుల నివాసాలపై దాడి చేసి వారిని పూర్తిగా నాశనం చేసి, ఈ రోజు వరకు వారు అక్కడే స్థిరపడ్డారు, ఎందుకంటే వారి మందలకు సరిపోయేంత పచ్చిక అక్కడ ఉంది. 42ఈ షిమ్యోను వంశీయులలో అయిదువందల మంది శేయీరు కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు వారికి నాయకులు. 43అమాలేకీయులలో తప్పించుకున్న మిగిలిన వారందరిని చంపి, ఈ రోజు వరకు వారక్కడ నివసించారు.
Copyright information for
TelTSA