Genesis 6:1-8
లోకంలో దుష్టత్వం
1నరులు భూమిపై వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్న సమయంలో వారికి కుమార్తెలు పుట్టినప్పుడు, 2దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు. 3అప్పుడు యెహోవా, “నా ఆత్మ నరులతో నిరంతరం వాదించదు, ▼▼లేదా నా ఆత్మ వారిలో ఉండదు
ఎందుకంటే వారు శరీరులు; ▼▼లేదా అవినీతిపరులు
వారి బ్రతుకు దినాలు 120 సంవత్సరాలు అవుతాయి” అని అన్నారు. 4ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు ▼▼నెఫిలీములు అంటే ఆజానుబాహులు
ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు. 5యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు. 6యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు. 7అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు. 8అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు.
Copyright information for
TelTSA