Joshua 12
ఓడిపోయిన రాజుల జాబితా
1ఇశ్రాయేలీయులు ఓడించిన దేశపు రాజులు వీరే: అర్నోను కొండగట్టు నుండి హెర్మోను పర్వతం వరకు, అరాబాకు తూర్పున ఉన్న ప్రాంతంతో సహా యొర్దానుకు తూర్పున ఉన్న వారి దేశాలను స్వాధీనం చేసుకున్నారు. 2అమోరీయుల రాజైన సీహోను హెష్బోను నుండి పరిపాలించాడు.అతడు అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి అనగా కొండ మధ్య నుండి అమ్మోనీయుల సరిహద్దు యైన యబ్బోకు నది వరకు పరిపాలించాడు. ఇందులో సగం గిలాదు ఉంది.
3అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు ▼
▼అంటే గలలీ
సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు.4అష్తారోతు, ఎద్రెయీలలో పాలించిన రెఫాయీయులలో చివరివాడైన బాషాను రాజైన ఓగు యొక్క భూభాగము.
5అతడు హెర్మోను పర్వతం, సలేకా, గెషూరు, మయకా ప్రజల సరిహద్దు వరకు బాషాను మొత్తాన్ని, గిలాదులో సగం హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు పరిపాలించాడు.
6యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలీయులు వారిని జయించారు. యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారి భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. 7యెహోషువ, ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన, లెబానోను లోయలోని బయల్-గాదు నుండి శేయీరు వైపుగా ఉన్న హలాకు పర్వతం వరకు జయించిన దేశాల రాజుల జాబితా ఇది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారి భూములను వారసత్వంగా ఇచ్చాడు. 8ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు. వారు జయించిన రాజు లెవరనగా: 9యెరికో రాజు ఒక్కడు
హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు
10యెరూషలేము రాజు ఒక్కడు
హెబ్రోను రాజు ఒక్కడు
11యర్మూతు రాజు ఒక్కడు
లాకీషు రాజు ఒక్కడు
12ఎగ్లోను రాజు ఒక్కడు
గెజెరు రాజు ఒక్కడు
13దెబీరు రాజు ఒక్కడు
గెదెరు రాజు ఒక్కడు
14హోర్మా రాజు ఒక్కడు
అరాదు రాజు ఒక్కడు
15లిబ్నా రాజు ఒక్కడు
అదుల్లాము రాజు ఒక్కడు
16మక్కేదా రాజు ఒక్కడు
బేతేలు రాజు ఒక్కడు
17తప్పూయ రాజు ఒక్కడు
హెఫెరు రాజు ఒక్కడు
18ఆఫెకు రాజు ఒక్కడు
లషారోను రాజు ఒక్కడు
19మాదోను రాజు ఒక్కడు
హాసోరు రాజు ఒక్కడు
20షిమ్రోను మెరోను రాజు ఒక్కడు
అక్షఫు రాజు ఒక్కడు
21తానాకు రాజు ఒక్కడు
మెగిద్దో రాజు ఒక్కడు
22కెదెషు రాజు ఒక్కడు
కర్మెలులోని యొక్నీము రాజు ఒక్కడు
23దోరు రాజు (నఫోత్ దోరు లోని) ఒక్కడు
గిల్గాలులో గోయీం రాజు ఒక్కడు
24తిర్సా రాజు ఒక్కడు
మొత్తం ముప్పై ఒక్క మంది రాజులు.
Copyright information for
TelTSA