‏ Nehemiah 7

1నేను గోడ కట్టిన తర్వాత తలుపులు నిలబెట్టి, ద్వారపాలకులను సంగీతకారులను, లేవీయులను నియమించాను. 2నా సోదరుడైన హనానీతో పాటు కోటకు అధిపతియైన హనన్యాను యెరూషలేముపై అధికారులుగా నియమించాను. హనన్యా నమ్మకమైనవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని భయం ఉన్నవాడు. 3నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను.

చెరనుండి తిరిగి వచ్చినవారి జాబితా

4అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు. 5కుటుంబాల ప్రకారం నమోదు చేయాలనే ఆలోచన దేవుడు నాకు పుట్టించగా నేను సంస్థానాధిపతులను అధికారులను ప్రజలను సమకూర్చాను. అంతలో ముందు వచ్చినవారి కుటుంబ వివరాలు ఉన్న ఒక గ్రంథం నాకు దొరికింది. దానిలో ఉన్న వివరాలు:

6బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి, 7జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు:

ఇశ్రాయేలు ప్రజల పురుషుల జాబితా:
8పరోషు వారసులు 2,172;
9షెఫట్యా వారసులు 372;
10ఆరహు వారసులు 652;
11పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,818;
12ఏలాము వారసులు 1,254;
13జత్తూ వారసులు 845;
14జక్కయి వారసులు 760;
15బిన్నూయి వారసులు 648;
16బేబై వారసులు 628;
17అజ్గాదు వారసులు 2,322;
18అదోనీకాము వారసులు 667;
19బిగ్వయి వారసులు 2,067;
20ఆదీను వారసులు 655;
21అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;
22హాషుము వారసులు 328;
23బేజయి వారసులు 324;
24హారీపు వారసులు 112;
25గిబియోను వారసులు 95.
26బేత్లెహేము వారసులు:
నెటోపా వారసులు 188;
27అనాతోతు వారసులు 128;
28బేత్-అజ్మావెతు వారసులు 42;
29కిర్యత్-యారీము, కెఫీరా బెయేరోతు వారసులు 743;
30రామా, గెబా వారసులు 621;
31మిక్మషు వారసులు 122;
32బేతేలు, హాయి వారసులు 123;
33రెండవ నెబో వారసులు 52;
34మరొక ఏలాము వారసులు 1,254;
35హారీము వారసులు 320;
36యెరికో వారసులు 345;
37లోదు, హదీదు, ఓనో వారసులు 721;
38సెనాయా వారసులు 3,930.

39యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973;
40ఇమ్మేరు వారసులు 1,052;
41పషూరు వారసులు 1,247;
42హారీము వారసులు 1,017.

43లేవీయులు: యెషూవ వారసులు (హోదవ్యా కుటుంబం, కద్మీయేలు కుటుంబం నుండి) 74.

44సంగీతకారులు: ఆసాపు వారసులు 148.

45ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138.

46ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,
47కేరోసు, సీయహా, పాదోను వారసులు,
48లెబానా, హగాబా, షల్మయి వారసులు,
49హానాను, గిద్దేలు, గహరు వారసులు,
50రెవాయా, రెజీను, నెకోదా వారసులు,
51గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు,
52బేసాయి, మెహూనీము, నెఫూసీము వారసులు,
53బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,
54బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,
55బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
56నెజీయహు, హటీపా వారసులు.
57సొలొమోను సేవకుల వారసులు: సొటయి, సోఫెరెతు, పెరీదా వారసులు
58యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,
59షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు.
60ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.

61తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు, అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు: 62దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642.

63యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు) వారసులు.
64వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు. 65కాబట్టి ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.

66సమూహం మొత్తం సంఖ్య 42,360, 67వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 245 మంది. 68వారి గుర్రాలు 736, కంచరగాడిదలు
ఎజ్రా 2:66 కూడా చూడండి
245,
69ఒంటెలు 435, గాడిదలు 6,720.

70కుటుంబ పెద్దలలో కొందరు పనికి సహాయపడ్డారు. అధిపతి ఖజానాకు 1,000 డారిక్కుల
అంటే, సుమారు 8.4 కి. గ్రా. లు
బంగారం, 50 పళ్లాలు, 530 యాజక వస్త్రాలు ఇచ్చాడు.
71కుటుంబ పెద్దలలో కొంతమంది పని కోసం ఖజానాకు 20,000 డారిక్కుల
అంటే, సుమారు 170 కి. గ్రా. లు
బంగారం, 2,200 మీనాల
అంటే, సుమారు 1 1/3 టన్నులు
వెండి ఇచ్చారు.
72మిగిలినవారంతా కలిసి 20,000 డారిక్కుల బంగారం 2,000 మీనాల
అంటే, సుమారు 1 1/4 టన్నులు
వెండి, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు.

73యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు, కొంతమంది ప్రజలతో పాటు మిగిలిన ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.

ధర్మశాస్త్రాన్ని చదివిన ఎజ్రా

ఇశ్రాయేలీయులంతా ఏడవ నెల రాగానే తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు,
Copyright information for TelTSA