‏ Numbers 2

గోత్రాలవారిగా శిబిరాల ఏర్పాటు

1యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: 2“ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”

3తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు. 4అతని దళంలో ఉన్నవారు 74,600.
5వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు. 6అతని దళంలో ఉన్నవారు 54,400.
7వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు. 8అతని విభజనలో ఉన్నవారు 57,400.
9యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.

10దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు. 11అతని దళంలో ఉన్నవారు 46,500.
12వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు. 13అతని దళంలో ఉన్నవారు 59,300.
14వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు
కొ.ప్ర.లలో డెయుయేలు అని వాడబడింది
కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు.
15అతని దళంలో ఉన్నవారు 45,650.
16రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు.

17తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు.

18పడమర వైపు: ఎఫ్రాయిం గోత్రం వారి జెండా ప్రకారం ఉండాలి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం ప్రజల నాయకుడు. 19అతని దళంలో ఉన్నవారు 40,500.
20మనష్షే గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే ప్రజల నాయకుడు 21అతని దళంలో ఉన్నవారు 32,200.
22వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు. 23అతని దళంలో ఉన్నవారు 35,400.
24ఎఫ్రాయిం శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,08,100. వీరు మూడవ గుంపుగా వెళ్తారు.

25ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు. 26అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700.
27ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు. 28అతని దళంలో ఉన్నవారు 41,500.
29వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు. 30అతని దళంలో ఉన్నవారు 53,400.
31దాను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,57,600. వీళ్ళు తమ ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా జెండాల క్రింద వెళ్తారు.

32వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550. 33యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు.

34కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు.
Copyright information for TelTSA