‏ Numbers 7

సమావేశ గుడారాన్ని ప్రతిష్ఠించడానికి అర్పణలు

1మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు. 2తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు. 3వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.

4యెహోవా మోషేతో, 5“సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.”

6కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు. 7అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు, 8అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు. 9కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు.

10బలిపీఠాన్ని అభిషేకించినప్పుడు, నాయకులు ప్రతిష్ఠార్పణలు తెచ్చి, బలిపీఠం ముందుంచారు. 11యెహోవా మోషేతో, “బలిపీఠం ప్రతిష్ఠించడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క నాయకుడు తమ అర్పణను తీసుకురావాలి.”

12మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. 13అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ
అంటే సుమారు 1.5 కి. గ్రా. లు; ఈ అధ్యాయంలో మిగతా వచనాల్లో కూడా
బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, డెబ్బై షెకెళ్ళ
అంటే సుమారు 800 గ్రాములు; ఈ అధ్యాయంలో మిగతా వచనాల్లో కూడా
బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
14ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ
అంటే సుమారు 115 గ్రాములు; ఈ అధ్యాయంలో మిగతా వచనాల్లో కూడా
బరువు ఉన్న బంగారు పళ్ళెం;
15దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
16పాపపరిహారబలి కోసం మేకపోతు;
17సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తెచ్చిన అర్పణ.

18రెండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఇశ్శాఖారు గోత్ర నాయకుడు, నెతనేలు కుమారుడైన సూయరు. 19అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
20ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
21దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
22పాపపరిహారబలి కోసం మేకపోతు;
23సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, ఒక సంవత్సరపు అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది నెతనేలు కుమారుడైన సూయరు తెచ్చిన అర్పణ.

24మూడవ రోజు అర్పణను తెచ్చిన వారు జెబూలూను గోత్ర నాయకుడు, హేలోను కుమారుడైన ఏలీయాబు. 25అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
26ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
27దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
28పాపపరిహారబలి కోసం మేకపోతు;
29సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు తెచ్చిన అర్పణ.

30నాలుగవ రోజు అర్పణను తెచ్చిన వారు రూబేను గోత్ర నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఎలీసూరు. 31అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
32ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
33దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
34పాపపరిహారబలి కోసం మేకపోతు;
35సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది ఎలీసూరు కుమారుడైన షెదేయూరు తెచ్చిన అర్పణ.

36అయిదవ రోజు అర్పణను తెచ్చిన వారు షిమ్యోను గోత్ర నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు. 37అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
38ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
39దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
40పాపపరిహారబలి కోసం మేకపోతు;
41సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తెచ్చిన అర్పణ.

42ఆరవరోజు అర్పణను తెచ్చిన వారు గాదు గోత్ర నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు. 43అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
44ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
45దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
46పాపపరిహారబలి కోసం మేకపోతు;
47సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు తెచ్చిన అర్పణ.

48ఏడవ రోజు అర్పణను తెచ్చిన వారు ఎఫ్రాయిం గోత్ర నాయకుడు, అమీహూదు కుమారుడైన ఎలీషామా. 49అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
50ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
51దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
52పాపపరిహారబలి కోసం మేకపోతు;
53సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా తెచ్చిన అర్పణ.

54ఎనిమిదవ రోజు అర్పణను తెచ్చిన వారు మనష్షే గోత్ర నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు. 55అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
56ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
57దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
58పాపపరిహారబలి కోసం మేకపోతు;
59సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు తెచ్చిన అర్పణ.

60తొమ్మిదవ రోజు అర్పణను తెచ్చిన వారు బెన్యామీను గోత్ర నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాను. 61అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
62ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
63దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
64పాపపరిహారబలి కోసం మేకపోతు;
65సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను తెచ్చిన అర్పణ.

66పదవ రోజు అర్పణను తెచ్చిన వారు దాను గోత్ర నాయకుడు, అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు. 67అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
68ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
69దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
70పాపపరిహారబలి కోసం మేకపోతు;
71సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు తెచ్చిన అర్పణ.

72పదకొండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఆషేరు గోత్ర నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు. 73అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
74ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
75దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
76పాపపరిహారబలి కోసం మేకపోతు;
77సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు తెచ్చిన అర్పణ.

78పన్నెండవ రోజు అర్పణను తెచ్చిన వారు నఫ్తాలి గోత్ర నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర. 79అతని అర్పణ:
పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
80ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
81దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
82పాపపరిహారబలి కోసం మేకపోతు;
83సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఇది ఏనాను కుమారుడైన అహీర తెచ్చిన అర్పణ.

84బలిపీఠం అభిషేకించబడినప్పుడు దాని ప్రతిష్ఠించడానికి ఇశ్రాయేలీయుల నాయకులు సమర్పించిన అర్పణలు ఇవి:
పన్నెండు వెండి పళ్ళాలు, పన్నెండు వెండి పాత్రలు పన్నెండు బంగారు పాత్రలు.
85వెండి పళ్ళెం ఒక్కొక్కటి నూట ముప్పై షెకెళ్ళు, వెండి పాత్ర ఒక్కొక్కటి డెబ్బై షెకెళ్ళు. అంతా కలిపితే వెండి పాత్రల బరువు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం రెండువేల నాలుగు వందల షెకెళ్ళు.
అంటే సుమారు 28 కి. గ్రా. లు
86ధూపద్రవ్యాలతో నిండియున్న బంగారు పళ్ళాలు, పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం పది షెకెళ్ళ బరువు గలవి పన్నెండు. అంతా కలిపితే, బంగారు పాత్రల బరువు నూట యిరవై షెకెళ్ళు.
అంటే సుమారు 1.4 కి. గ్రా. లు

87దహనబలి కోసం వాటి భోజనార్పణతో పాటు ఇవ్వబడిన పశువులు మొత్తం పన్నెండు కోడెలు, పన్నెండు పొట్టేళ్లు. పన్నెండు ఏడాది గొర్రెపిల్లలు. పన్నెండు మేకపోతులు పాపపరిహారబలి కోసం వాడబడ్డాయి.
88సమాధానబలి కోసం ఇవ్వబడిన పశువులు మొత్తం యిరవై నాలుగు ఎడ్లు, అరవై పొట్టేళ్లు, అరవై మేకపోతులు అరవై ఏడాది గొర్రెపిల్లలు.

బలిపీఠం అభిషేకించి ప్రతిష్ఠించినప్పుడు అర్పించిన అర్పణలు ఇవి.

89యెహోవాతో మాట్లాడటానికి మోషే సమావేశ గుడారంలో ప్రవేశించినప్పుడు, నిబంధన మందసం పైనున్న ప్రాయశ్చిత్త మూత మీదుగా ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి అతనితో మాట్లాడటం అతనికి వినిపించింది. ఇలా యెహోవా అతనితో మాట్లాడారు.
Copyright information for TelTSA