‏ Proverbs 27

1రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు,
ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.

2నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి;
నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి.

3రాయి భారం ఇసుక ఒక భారం,
మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము.

4కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది.
కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?

5అంతరంగంలో ప్రేమించడం కంటే
బహిరంగంగా గద్దించడం మేలు.

6స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి,
కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.

7కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును.
ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తియ్యగా ఉంటుంది.

8తన ఇల్లు విడిచి తిరిగేవాడు
గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు.

9అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి,
స్నేహితుని వల్ల కలిగే వినోదం
వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది.

10నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు,
నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు,
దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.

11నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము;
అప్పుడు నిన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.

12వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు,
సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.

13అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి;
ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.

14ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే,
అది శాపంగా పరిగణించబడింది.

15ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును
గయ్యాళియైన భార్యయు సమానము.
16దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను
తన కుడిచేత నూనె పట్టుకొను వానితోను సమానుడు.

17ఇనుము చేత ఇనుము పదునైనట్లు
ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు.

18అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు,
తన యజమానుని క్షమించేవాడు ఘనత పొందుతాడు.

19నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు,
మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.

20పాతాళానికి, లోతైన గుంటకును తృప్తికానేరదు.
అలాగున మనుష్యుల చూపు తృప్తికానేరదు.

21వెండికి మూస బంగారానికి కొలిమి తగినది,
అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు.

22బుద్ధిహీనున్ని రోటిలోని
గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే
వాని మూర్ఖత్వం వదిలిపోదు.

23నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో,
నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు;
24ఐశ్వర్యం శాశ్వతం కాదు,
కిరీటం తరతరాల వరకు ఉండదు.
25ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు.
కొండ మీది నుండి గడ్డిని పోగుచేసినప్పుడు.
26నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి
ఒక చేను కొను డబ్బుకు మేకపోతులు సరిపోతాయి.
27నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి
నీ పనికత్తెల పోషణలు మేకపాలు సమృద్ధి అవుతాయి.
Copyright information for TelTSA