‏ Psalms 112

1యెహోవాను స్తుతించండి.
హెబ్రీలో హల్లెలూయా

యెహోవాకు భయపడేవారు ధన్యులు,
వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.

2వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు;
యథార్థవంతుల తరం దీవించబడుతుంది.
3వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి,
వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది.
4దయ కనికరం గలవారికి నీతిమంతులకు,
యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది.
5దయతో అప్పు ఇచ్చేవారికి,
తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.

6నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు;
వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.
7దుర్వార్తల వలన వారు భయపడరు;
యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.
8వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు;
చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.
9వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు,
వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది;
వారి కొమ్ము
కొమ్ము ఇక్కడ ఠీవిని సూచిస్తుంది.
ఘనత పొంది హెచ్చింపబడుతుంది.

10దుష్టులు చూసి విసుగుచెందుతారు,
వారు పండ్లు కొరుకుతూ క్షీణించి పోతారు;
దుష్టుల ఆశలు విఫలమవుతాయి.
Copyright information for TelTSA