‏ Psalms 121

యాత్రకీర్తన.

1కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను,
నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?
2ఆకాశాన్ని భూమిని సృజించిన
యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.

3ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు,
నిన్ను కాపాడేవాడు కునుకడు.
4నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు
కునుకడు న్రిదపోడు.

5యెహోవా నిన్ను కాపాడతారు,
యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.
6పగటివేళ సూర్యుడు కాని లేదా,
రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.

7సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు
ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
8ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో
యెహోవా నిన్ను కాపాడును.
Copyright information for TelTSA