Psalms 122
దావీదు యాత్రకీర్తన. 1“యెహోవా ఆలయానికి వెళ్దాం” అనినాతో అన్న వారితో నేను సంతోషించాను.
2ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో
మా పాదాలు నిలిచి ఉన్నాయి.
3యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము;
అది దగ్గరగా కుదించబడింది.
4ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం
యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి
వారి గోత్రాలు అనగా
యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి.
5అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి,
అవి దావీదు ఇంటివారి సింహాసనాలు.
6యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి.
“యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!
7మీ ప్రాకారాలలో సమాధానం
మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!”
8నా సోదరులు నా స్నేహితుల కోసం
“మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను.
9మన దేవుడైన యెహోవా మందిరం కోసం
మీ వృద్ధిని నేను కోరతాను.
Copyright information for
TelTSA