Psalms 124
దావీదు యాత్రకీర్తన. 1– 2– 3– 4– 5 ▼▼పద్యం(లు) 5 యొక్క వచనం ఈ పద్యంలో విలీనం చేయబడింది.
▼▼పద్యం(లు) 5 యొక్క వచనం ఈ పద్యంలో విలీనం చేయబడింది.
▼▼పద్యం(లు) 5 యొక్క వచనం ఈ పద్యంలో విలీనం చేయబడింది.
▼▼పద్యం(లు) 5 యొక్క వచనం ఈ పద్యంలో విలీనం చేయబడింది.
మనుష్యులు మనపై దాడి చేసినప్పుడువారి కోపం మనపై రగులుకొన్నప్పుడు
యెహోవా మనకు తోడై ఉండకపోతే
వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు;
వరద మన మీదుగా పొర్లి ఉండేది,
జలప్రవాహం మనల్ని ముంచేసి
జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది
అని ఇశ్రాయేలు చెప్పును గాక.
6వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని
యెహోవాకు స్తుతి చెల్లును గాక.
7వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా
మనం తప్పించుకున్నాము;
ఉరి తెగిపోయింది,
మనం తప్పించుకున్నాము.
8భూమ్యాకాశాలను సృజించిన
యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.
Copyright information for
TelTSA