Psalms 129
యాత్రకీర్తన. 1“నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు”అని ఇశ్రాయేలు అనాలి;
2“నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు,
కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.
3దున్నువారు దున్నినట్లు
నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.
4అయితే యెహోవా నీతిమంతుడు;
దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”
5సీయోనును ద్వేషించే వారందరు
సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.
6వారు ఎదగక ముందే ఎండిపోయిన
ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక.
7దానితో కోత కోసేవారు తమ చేతిని గాని
పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.
8“యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక;
యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము”
అని బాటసారులు అనకుందురు గాక.
Copyright information for
TelTSA