Psalms 146
1యెహోవాను స్తుతించండి,నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
2జీవితమంతా యెహోవాను స్తుతిస్తాను;
నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి స్తుతి పాడతాను.
3రాజుల మీద నమ్మకం ఉంచకండి,
నరులు మిమ్మల్ని రక్షించలేరు.
4వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు;
వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి.
5ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో,
ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.
6ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని,
వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే.
ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.
7ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు,
ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు.
యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు,
8యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు,
యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు,
యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు.
9యెహోవా పరదేశీయులను కాపాడతారు.
తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు.
కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.
10యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు.
సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు.
యెహోవాను స్తుతించండి.
Copyright information for
TelTSA