Psalms 24
దావీదు కీర్తన. 1భూమి, దానిలో ఉండే సమస్తం,లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.
2ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు.
జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.
3యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు?
ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?
4ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో,
ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో,
ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు ▼
▼లేదా తప్పుడు దేవుళ్ళు
చేయరో, వారే కదా!5వారు యెహోవా నుండి దీవెన పొందుతారు
వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.
6ఆయనను వెదికే తరం ఇదే,
యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. సెలా
7గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి;
మహిమగల రాజు ప్రవేశించేలా
పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
8ఈ మహిమగల రాజు ఎవరు?
శక్తిమంతుడు బలశాలియైన యెహోవా,
యుద్ధ శూరుడైన యెహోవా.
9గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి;
మహిమగల రాజు ప్రవేశించేలా
పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
10ఈ మహిమగల రాజు ఎవరు?
సైన్యాలకు అధిపతియైన యెహోవాయే
ఆయనే ఈ మహిమగల రాజు. సెలా
Copyright information for
TelTSA