Psalms 3
దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. 1యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు!నామీదికి ఎంతోమంది లేస్తారు!
2“దేవుడు అతన్ని విడిపించడు”
అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా ▼
▼సెలా హెబ్రీ భాషలో ఈ పదానికి స్పష్టమైన అర్థం లేదు. ఈ పదం కీర్తనలో తరచుగా వస్తుంది: ఇది సంగీతానికి సంబంధించిన పదం అయి ఉండవచ్చు. కీర్తన 3:4; కీర్తన 3:8 లో కూడా
3కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా,
నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.
4నేను యెహోవాకు మొరపెడతాను,
ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా
5నేను పడుకుని నిద్రపోతాను;
యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.
6అన్ని వైపుల నుండి
పదివేలమంది నాపై పడినా నేను భయపడను.
7యెహోవా, లెండి!
నా దేవా, నన్ను విడిపించండి!
నా శత్రువులందరిని దవడపై కొట్టండి;
దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.
8రక్షణ యెహోవా నుండి వస్తుంది.
మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా
Copyright information for
TelTSA