Psalms 47
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. 1సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి;దేవునికి ఆనందంతో కేకలు వేయండి.
2మహోన్నతుడైన యెహోవా భయంకరుడు,
భూమి అంతటికి ఆయన గొప్ప రాజు.
3ఆయన దేశాలను మన వశం చేశారు,
జనాలను మన పాదాల క్రింద ఉంచారు.
4మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు.
అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా
5దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు,
యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.
6దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి;
మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.
7దేవుడు భూమి అంతటికి రాజు;
ఆయనకు స్తుతికీర్తన పాడండి.
8దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు;
దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు.
9దేశాల అధిపతులు సమకూడతారు
అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు
భూమి మీద డాళ్లు ▼
▼లేదా రాజులు
దేవునికి చెందినవి;ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.
Copyright information for
TelTSA