Psalms 54
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది. 1ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి;మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి.
2ఓ దేవా! నా ప్రార్థన వినండి;
నా నోటి మాటలను ఆలకించండి.
3అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు;
దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు
వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా
4ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం;
ప్రభువే నన్ను సంరక్షించేవారు.
5నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి;
మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి.
6యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను;
మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.
7మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు,
నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.
Copyright information for
TelTSA