Psalms 87
కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము. 1యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.2యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె
యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.
3దేవుని పట్టణమా, నీ గురించి
గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. సెలా
4“నేను రాహాబు ▼
▼ఈజిప్టు యొక్క కావ్య నామము. పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు.
బబులోనునునన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను
అలాగే ఫిలిష్తియా, తూరు కూషు ▼
▼అంటే, నైలు ఉపరితల ప్రాంతం
కూడా,‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు.
5నిజమే, సీయోను గురించి ఇలా అంటారు,
“ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి,
మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు.”
6యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు
“ఇది సీయోనులో జన్మించింది” అని గుర్తిస్తారు. సెలా
7వారు వాయిద్యాలు వాయిస్తుండగా,
“నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు.
Copyright information for
TelTSA