Psalms 90
నాలుగవ గ్రంథము
కీర్తనలు 90–106
దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన. 1ప్రభువా, తరతరాల నుండిమీరే మా నివాస స్థలంగా ఉన్నారు.
2పర్వతాలు పుట్టక ముందే,
మీరు లోకమంతటిని చేయక ముందే
నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు.
3“మనుష్యులారా, మీరు మంటికి తిరిగి వెళ్లండి” అని అంటూ,
మీరు ప్రజలను ధూళి వైపుకు తిరిగి త్రిప్పుతారు.
4మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు
ఇప్పుడే గడిచిన రోజులా,
రాత్రి జాముల్లా ఉన్నాయి.
5అయినప్పటికీ మీరు మరణ నిద్రలో ప్రజలను ప్రవాహంలా తుడిచివేస్తారు;
వారు ప్రొద్దున్నే మొలిచిన గడ్డిలా ఉన్నారు.
6అది ఉదయం క్రొత్తగా పుడుతుంది,
సాయంకాలానికల్లా వాడి ఎండిపోతుంది.
7మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము
మీ ఆగ్రహానికి భయపడుతున్నాము.
8మీరు మా దోషాలను మీ ఎదుట,
మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.
9మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి;
మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము.
10మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు,
అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు;
అయినా వాటి వైభవం నాశనం దుష్టత్వం,
అవి త్వరగా గడచిపోతాయి, మేము ఎగిరిపోతాం.
11ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు!
మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది.
12మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి,
తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.
13యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం?
మీ దాసుల మీద కనికరం చూపండి.
14ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి,
తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము.
15మమ్మల్ని బాధించినన్ని దినాలు,
మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి.
16మీ క్రియలు మీ సేవకులకు,
మీ ప్రభావము వారి పిల్లలకు కనుపరచబడును గాక.
17మన ప్రభువైన దేవుని దయ ▼
▼లేదా సౌందర్యం
మనమీద ఉండును గాక;మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి,
అవును, మా చేతి పనులను స్థిరపరచండి.
Copyright information for
TelTSA