Psalms 91
1మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారుసర్వశక్తిమంతుని ▼
▼మూ.భా.లో షద్దాయ్
నీడలో స్థిరంగా ఉంటారు.2యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట,
నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.”
3వేటగాని వల నుండి,
మరణకరమైన తెగులు నుండి,
ఆయన తప్పక విడిపిస్తారు.
4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు,
ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం;
ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.
5రాత్రి భయాలకు గాని,
పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని,
6చీకటిలో సంచరించే తెగులుకు గాని,
మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని,
నీవు భయపడాల్సిన అవసరం లేదు.
7నీ ప్రక్కన వేయిమంది,
నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు,
అయినా, అది నీ దగ్గరకు రాదు.
8నీవు నీ కళ్లతో గమనిస్తావు
దుష్టులు శిక్ష పొందడం నీవు చూస్తావు.
9“యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని,
మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,
10ఏ హాని నీ మీదికి రాదు,
ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.
11నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని
నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.
12నీ పాదాలకు రాయి తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు.
13నీవు సింహం మీద నాగుపాము మీద నడిచి వెళ్తావు;
కొదమ సింహాన్ని సర్పాన్ని త్రొక్కివేస్తావు.
14“అతడు ▼
▼అంటే, బహుశ రాజు
నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను”అని యెహోవా అంటున్నారు;
అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను.
15అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను;
కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను,
అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.
16దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను,
నా రక్షణ అతనికి చూపిస్తాను.
Copyright information for
TelTSA