Psalms 95
1రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం;రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.
2కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం,
సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.
3యెహోవా గొప్ప దేవుడు,
దైవములందరి పైన గొప్ప రాజు.
4భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి,
పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.
5సముద్రం ఆయనదే, ఆయనే దాన్ని చేశారు,
ఆయన హస్తాలు ఆరిన నేలను రూపొందించాయి.
6రండి, సాగిలపడి ఆరాధించుదాం,
మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;
7ఎందుకంటే ఆయన మన దేవుడు
మనం ఆయన పచ్చికలోని ప్రజలం,
ఆయన శ్రద్ధచూపే మంద.
నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,
8“మీరు మెరీబా ▼
▼మెరీబా అంటే గొడవపడుట.
దగ్గర చేసినట్టుగా,అరణ్యంలో మస్సా ▼
▼మస్సా అంటే పరీక్షించుట
దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.9అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు;
నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.
10నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను:
‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు,
వారు నా మార్గాలను తెలుసుకోలేదు’
11కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’
అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”
Copyright information for
TelTSA