Psalms 101
దావీదు కీర్తన. 1యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను;మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.
2నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను,
మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు?
నేను నిందారహితమైన హృదయంతో
నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.
3నీచమైన దేనినైనా సరే
నేను నా కళ్లెదుట ఉంచను.
విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం;
అందులో నేను పాలుపంచుకోను.
4కుటిల హృదయం నాకు దూరమై పోవాలి;
చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.
5రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని,
నేను నాశనం చేస్తాను.
అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని
నేను సహించను.
6నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి,
వారు నాతో నివసించాలని;
నిందారహితంగా జీవించేవారు
నాకు సేవ చేస్తారని.
7మోసం చేసే వారెవరూ
నా భవనంలో నివసించరు;
అబద్ధాలాడే వారెవరూ
నా ఎదుట నిలబడరు.
8ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని
నేను మౌనంగా ఉంచుతాను;
యెహోవా పట్టణంలో నుండి
కీడు చేసేవారిని పంపివేస్తాను.
Copyright information for
TelTSA