Psalms 110
దావీదు కీర్తన. 1యెహోవా నా ప్రభువుతో ▼▼లేదా ప్రభువు
చెప్పిన మాట:“నేను నీ శత్రువులను
నీ పాదపీఠంగా చేసే వరకు
నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”
2యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ,
సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు,
3మీ యుద్ధ దినాన
మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి.
పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై
ఉదయపు గర్భం నుండి మంచులా
మీ యువకులు మీ దగ్గరకు వస్తారు.
4“మెల్కీసెదెకు క్రమంలో,
నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు”
అని యెహోవా ప్రమాణం చేశారు
ఆయన తన మనస్సు మార్చుకోరు.
5ప్రభువు ▼
▼లేదా నా ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నారు;
మీ కుడి ప్రక్కనే ఉన్నాడు;తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు.
6అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు;
అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు.
7దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు,
కాబట్టి అతడు తల పైకెత్తుతాడు.
Copyright information for
TelTSA