Psalms 133
దావీదు యాత్రకీర్తన 1సహోదరులు ఐక్యత కలిగి నివసించడంఎంత మేలు! ఎంత మనోహరం!
2అది అహరోను తలమీద పోయబడి
అతని గడ్డం మీదుగా కారుతూ,
వస్త్రపు అంచు వరకు కారిన
ప్రశస్తమైన తైలం వంటిది.
3అది సీయోను కొండలమీదికి దిగివచ్చే
హెర్మోను మంచులా ఉంటుంది.
యెహోవా తన ఆశీర్వాదాన్ని,
జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.
Copyright information for
TelTSA