‏ Psalms 134

యాత్రకీర్తన.

1యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే
యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.
2పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి
యెహోవాను స్తుతించండి.

3ఆకాశాన్ని భూమిని సృష్టించిన
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.
Copyright information for TelTSA