‏ Psalms 43

1నా దేవా, నాకు న్యాయం తీర్చండి,
భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా
నా పక్షంగా వాదించి,
మోసగాళ్ల నుండి దుష్టుల నుండి
నన్ను విడిపించండి.
2మీరే దేవుడు, నా బలమైన కోట.
నన్నెందుకు ఇలా తిరస్కరించారు?
శత్రువులచేత అణచివేయబడుతూ
నేనెందుకు దుఃఖంతో గడపాలి?
3మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి;
అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి
మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.
4అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను,
నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను.
దేవా! నా దేవా!
వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

5నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?
దేవుని మీద నిరీక్షణ ఉంచు,
ఆయనే నా రక్షకుడు నా దేవుడు
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
Copyright information for TelTSA