‏ Psalms 46

సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము.

1దేవుడు మనకు ఆశ్రయం బలం,
ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం
2కాబట్టి భూమి మార్పుచెందినా,
నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.
3జలాలు గర్జించినా నురుగు కట్టినా
పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా

4అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి,
అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.
5అందులో దేవుడున్నారు, అది కూలదు;
తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.
6దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి;
దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది.

7సైన్యాల యెహోవా మనతో ఉన్నారు;
యాకోబు దేవుడు మనకు కోట. సెలా

8రండి యెహోవా చేసిన క్రియలను చూడండి,
లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.
9ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద
యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు.
విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు;
రథాలను
లేదా కవచాలు
అగ్నితో కాల్చేస్తారు.
10“ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి;
దేశాల్లో నేను హెచ్చింపబడతాను,
భూమి మీద నేను హెచ్చింపబడతాను.”

11సైన్యాల యెహోవా మనతో ఉన్నారు;
యాకోబు దేవుడు మనకు కోట. సెలా
Copyright information for TelTSA