‏ Psalms 48

ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన.

1మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద
యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.

2మహారాజు పట్టణమైన సీయోను పర్వతం
సాఫోన్
సాఫోన్ కనానీయుల చేత అతి పవిత్ర పర్వతముగా పరిగణించబడింది.
ఎత్తైన స్థలంలా
అందంగా కనిపిస్తూ
సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.
3దేవుడు ఆమె
ఆమె ఇక్కడ యెరూషలేమును సూచిస్తుంది.
కోటలలో ఉన్నారు;
ఆయనే దానికి కోట అని చూపించారు.

4రాజులు దళాలతో కలిసి,
వారు ముందుకు వచ్చినప్పుడు,
5వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు;
వారు భయంతో పారిపోయారు.
6వారిలో వణుకు పుట్టింది,
ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.
7తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా
మీరు వారిని నాశనం చేశారు.

8మనం విన్నదే,
మనం చూశాం;
సైన్యాల యెహోవా పట్టణంలో,
మన దేవుని పట్టణంలో,
దేవుడు దాన్ని నిత్యం
సుస్థిరంగా ఉండేలా చేస్తారు. సెలా

9దేవా! మీ మందిరం మధ్యలో
మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.
10ఓ దేవా, మీ పేరులా,
మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది;
మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
11మీ తీర్పులను బట్టి
సీయోను పర్వతం ఆనందిస్తుంది
యూదా పట్టణాలు
హెబ్రీలో కుమార్తెలు అని వాడబడింది
సంతోషంగా ఉన్నాయి.

12సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి,
దాని బురుజులెన్నో లెక్కించండి.
13ఆమె గురించి రాబోయే తరం వారికి
మీరు చెప్పగలిగేలా,
దాని కోటగోడలను పరిశీలించండి,
దాని కోటలను చూడండి.

14ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు;
ఆయన చివరి వరకు నడిపిస్తారు.
Copyright information for TelTSA