Psalms 76
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. 1యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు;ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.
2షాలేములో ఆయన గుడారం ఉంది.
సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.
3అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు,
డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా
4వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే,
మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు.
5బలవంతులు దోపిడి చేయబడ్డారు,
వారు నిద్రపోయారు.
ఏ ఒక్క యోధుడు
మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు.
6యాకోబు దేవా! మీరు గద్దిస్తే
గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.
7మీ ఒక్కరికే భయపడాలి.
మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?
8పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు,
దేశం భయపడి మౌనం వహించింది.
9ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి,
తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా
10మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది,
మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు. ▼
▼లేదా మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్నవారు నియంత్రించబడతారు
11దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి;
పొరుగు దేశాలన్నీ
భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.
12పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు;
భూరాజులు ఆయనను చూసి భయపడాలి.
Copyright information for
TelTSA