‏ Psalms 80

సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన.

1ఇశ్రాయేలు ప్రజల కాపరీ,
యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి.
కెరూబుల
కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.
మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,
2ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి.
మీ పరాక్రమాన్ని చూపించండి;
వచ్చి మమ్మల్ని రక్షించండి.

3ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;
మేము రక్షింపబడేలా
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

4సైన్యాల యెహోవా దేవా,
ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా
మీ కోపం మండుతుంది?
5మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు;
మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు.
6మమ్మల్ని మా పొరుగువారికి హాస్యాస్పదంగా
బహుశ ప్రా. ప్ర. లలో వివాదాస్పదం
చేశారు.
మా శత్రువులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.

7సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి;
మేము రక్షింపబడేలా
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

8మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు;
మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు.
9మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు,
అది వేళ్ళూనుకొని భూమిని నింపింది.
10దాని నీడ పర్వతాలను కప్పింది,
దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి.
11దాని కొమ్మలు సముద్రం
బహుశ మధ్యధరా సముద్రం కావచ్చు
వరకు,
దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి.

12దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా
దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు?
13అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి,
పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి.
14సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి!
ఆకాశం నుండి ఇటు చూడండి!
ఈ ద్రాక్షవల్లిని గమనించండి.
15అది మీ కుడి హస్తం నాటిన వేరు,
మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.
లేదా కొమ్మ

16మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది;
మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు.
17మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద,
మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి.
18అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము;
మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము.

19సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;
మేము రక్షింపబడేలా,
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
Copyright information for TelTSA