‏ Psalms 82

ఆసాపు కీర్తన.

1దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు;
ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు:

2“మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు
దుష్టులకు పక్షపాతం చూపిస్తారు? సెలా
3బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి;
పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి.
4బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి;
దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి.

5“వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు.
వారు చీకటిలో తిరుగుతారు;
భూమి పునాదులు కదిలిపోయాయి.

6“ ‘మీరు “దేవుళ్ళు”;
మీరంతా మహోన్నతుని కుమారులు.’
7అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు;
ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను.”

8ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి,
ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.
Copyright information for TelTSA