Psalms 93
1యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు;యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు;
నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.
2మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే.
అనాది కాలం నుండి మీరున్నారు.
3యెహోవా, నదులలో వరదలు లేచాయి,
నదులు ఉరుములా గర్జిస్తున్నాయి,
అలలు చెలరేగుతున్నాయి.
4జలప్రవాహాల ఘోష కన్నా
బలమైన సముద్ర తరంగాల కన్నా,
యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.
5యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి;
యెహోవా మీ మందిరం
అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.
Copyright information for
TelTSA